ట్విట్టర్ వాడితే డబ్బులు కట్టాలి.. ఎవరెవరంటే - MicTv.in - Telugu News
mictv telugu

ట్విట్టర్ వాడితే డబ్బులు కట్టాలి.. ఎవరెవరంటే

May 4, 2022

ప్రముఖ మెసేజింగ్ యాప్ ట్విట్టర్‌ను ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 44 బిలియన్ డాలర్లకు కొన్న మస్క్, అంత డబ్బును ఎలా రికవరీ చేస్తాడని అంతా అనుమానించారు. దానికి సమాధానంగా యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తానని మస్క్ తాజాగా ప్రకటించారు. ఇప్పటివరకు ట్విట్టర్ యూజర్ల నుంచి ఎలాంటి డబ్బు వసూలు చేయలేదు. కేవలం ప్రకటనల ఆధారంగా వచ్చే ఆదాయమే ఇప్పటివరకు వచ్చింది. అయితే ఇక నుంచి వసూలు చేసే చార్జీలు సాధారణ వినియోగదారుల నుంచి కాదు. ట్విట్టర్‌ను వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగించేవారు, ప్రభుత్వాల వద్ద నుంచి మాత్రమే వసూలు చేస్తామని స్వయంగా ఎలాన్ మస్క్ ప్రకటించారు. కాగా, ఇంతకు ముందులా కాకుండా ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయలను వెల్లడించే వేదికగా ట్విట్టర్‌ను మలుస్తానని మస్క్ ఇదివరకే ప్రకటించాడు.