70 కార్లలో అమరావతి వెళ్తే.. ఇంత అన్యాయం చేస్తారా? - MicTv.in - Telugu News
mictv telugu

70 కార్లలో అమరావతి వెళ్తే.. ఇంత అన్యాయం చేస్తారా?

April 19, 2022

02

ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసినప్పటి నుంచి మొదలైన అసంతృప్తి ఇంకా రగులుతూనే ఉంది. మంత్రి పదవి తప్పనిసరిగా వస్తుందని భావించిన వారు రాకపోయేసరికి కినుక వహించడంతో సజ్జల, సీఎం జగన్ స్వయంగా వారితో మాట్లాడి వారిని కన్విన్స్ చేయగలిగారు. ఆ లిస్టులో ఇంకా కొందరు మిగిలున్నారు. వారిని అధిష్టానం ఇంతవరకు పట్టించుకోలేదని వారే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పార్టీ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాకు మంత్రి పదవి రాకపోవడంపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ నుంచి నాకు ఇంతవరకు ఎలాంటి పిలుపు రాలేదు. నాకు జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు కార్యకర్తలు 70 కార్లలో అమరావతి వెళ్లి సజ్జలతో మాట్లాడారు. అయినా కుదరలేదు. ఈ బోడి రాజకీయాలు నాకెందుకు? నేనేమీ అమాయకుడిని కాదు. హింసావాదిని. అధిష్టానం ఇప్పుడు నన్ను దెబ్బకొట్టింది. అవకాశం వచ్చినప్పుడు నేనూ దెబ్బకొడతా’ అని అభిప్రాయపడ్డారు.