జీతాల చెల్లింపుకు అదనంగా డబ్బుకావాలి.. ఆర్టీసీ యాజమాన్యం! - MicTv.in - Telugu News
mictv telugu

జీతాల చెల్లింపుకు అదనంగా డబ్బుకావాలి.. ఆర్టీసీ యాజమాన్యం!

October 21, 2019

RTC .

తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి జీతాలు ఆగిపోయాయి. అయితే,

సెప్టెంబర్ నెల జీతాలను చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు సూచించింది. 49,190 మంది కార్మికుల జీతాల చెల్లింపు జాప్యంపై దాఖలైన పిటిషన్‌పై గత బుధవారం ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలావుండగా కార్మికుల వేతనాల చెల్లింపునకు అవసరమైన నిధులు తమ వద్ద లేవని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. తమవద్ద ప్రస్తుతం రూ.7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని.. జీతాల కోసం రూ.230 కోట్లు అవసరం అని చెప్పింది. 

కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమని పేర్కొంది. చేసిన పనికి వేతనం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది. కార్మికులతో పని చేయించుకుని వారి ప్రాథమిక హక్కులకు ఆర్టీసీ యాజమాన్యం భంగం కలిస్తోందంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని న్యాయస్థానానికి విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.