పేటీఎంలో రూ.10 కోట్ల భారీ మోసం - MicTv.in - Telugu News
mictv telugu

పేటీఎంలో రూ.10 కోట్ల భారీ మోసం

May 15, 2019

డిజిటల్ వాలెట్ పేటీఎం మాల్‌కు క్యాష్‌బ్యాక్‌ రూపంలో ఏకంగా రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు భారీ మోసం చేశారు. ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా వెల్లడించింది. గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్‌ సంస్థ ఈవైతో కలిసి రూపొందించిన ఒక ప్రత్యేక టూల్‌తో ఈ మోసాన్ని గుర్తించినట్లు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కొందరు చిరు వర్తకులకు భారీగా క్యాష్‌బ్యాక్ లభిస్తున్న విషయాన్ని సంస్థ అధికారులు గుర్తించారు. ఆ దిశగ విచారణ చేపట్టగా ఈ రూ.10 కోట్ల భారీ దోపిడీ బయటపడిందని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ వెల్లడించారు.

‘సంస్థలో పనిచేసే కొంతమంది కింది స్థాయి ఉద్యోగులు కూడా వారికి సహకరించారు. నకిలీ ఆర్డర్లు సృష్టించి క్యాష్‌బ్యాక్‌ ద్వారా వచ్చిన సొమ్మును సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ ప్లాన్‌తో ముందుకు వెళ్తాం’ అని తెలిపారు.

దోపిడీదారులకు సహకరించిన  వంద మంది ఉద్యోగులను కంపెనీ తొలగించింది. కొందరు విక్రేతలను కూడా తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. ఈవైతో తమ అనుబంధం మునుపటిలానే కొనసాగుతుందని కంపెనీ స్పష్టంచేసింది. ఇందుకోసం మానవ వనరులతో సమానంగా, కృత్రిమ మేథను కూడా వాడతామని తెలిపారు.