పేటీఎం మరింత ఈజీ.. మొబైల్ బ్యాంకింగ్ యాప్ - MicTv.in - Telugu News
mictv telugu

పేటీఎం మరింత ఈజీ.. మొబైల్ బ్యాంకింగ్ యాప్

March 15, 2019

పేటీఎం తన వినియోగదారుల సౌకర్యార్థం మరొక కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తాజాగా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా ఎప్పుడైనా బ్యాంక్ సహాయాన్ని కోరవచ్చు. ఇంకా బ్యాంక్ అకౌంట్‌ను వేగంగా, సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అకౌంట్ బ్యాలెన్స్ వివరాలతో సహా డిజిటల్ డెబిట్ కార్డు యాక్సెస్, డెబిట్ కార్డు కోసం రిక్వెస్ట్ పంపడం వంటి సేవలను పొందుపరిచింది.

Paytm Payments Bank launches its own mobile app.

ఈ యాప్‌ వల్ల 4.3 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం కలుగుతుందని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సతీష్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. మొబైల్ బ్యాంకింగ్ యాప్‌తో వారంలో ఏడు రోజులూ బ్యాంక్ సేవలు పొందవచ్చని వివరించారు. అయితే ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో ఇంకా అందుబాటులోకి రాలేదు.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు 2017లో ప్రారంభమయ్యాయి. బ్యాంక్‌కు ప్రస్తుతం 4.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. బ్యాంక్ ఇప్పటికే 20 లక్షలకు పైగా డెబిట్ కార్డులను జారీ చేసింది. అలాగే బ్యాంక్ తన కస్టమర్లందరికీ వర్చువల్ డెబిట్ కార్డులను ఇష్యూ చేసింది.