వాట్సప్ కి పోటీగా రంగంలోకి పేటియం..! - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సప్ కి పోటీగా రంగంలోకి పేటియం..!

August 2, 2017

స్మాట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్ లో వాట్సప్ కంపల్సరీ గా ఉంటుంది,వాట్సప్ యాప్ ను వాడని వారు బహుశా ఉండరేమో కదా,మరి వాట్సప్ యాప్ లున్న ఆప్షన్లు తక్కోనా…నెట్టు బ్యాలెన్సుంటే సాలు.. ఫ్రీ చాటింగులు,ప్రీగ పోటోలు,వీడియోలు పంపచ్చు,ఒక్కటే పారి దోస్తులందరికి ఒక్కదగ్గర చేరి.. గదే గ్రూప్ చాటింగ్ చెయ్యచ్చు,వేరే ఊరు దేశంలున్నా సరే ఒకల  మోఖాలు ఒకలు చూస్కుంట మాట్లాడుకోవచ్చు.గిన్ని సౌలతున్నంక ఇగ దాన్ని ఫోన్ల ఎందుకు వెట్కోంకదా,కనీ ఇప్పుడు గ వాట్సప్ కు పోటీగా పేటియం..పేటియం మెసెంజర్ అనే కొత్తయాప్ ను తీస్కవాబోతుందట, అప్పుడు వాట్సప్ లెక్కనే గన్ల గుడ అన్ని సౌలతులుంటయట.ఇప్పటికే వాణిజ్య అవసరాలకు పేటియం ఎంత ఉపయోగపడుతుందో అందరికి తెలిసిందే,పెద్ద దుక్నంకాన్నుంచి,శిన్న శిల్లరకొట్టు దాక అందరు పేటీయం సౌలతిని వెట్కుంటున్నరు.పైసలు శేతుల లేనప్పుడు అందరు గీ పేటియంనే నమ్ముకుంటున్నరు.మొబైల్‌ రీచార్జ్‌, కేబుల్‌డిష్‌ రీచార్జ్‌.ఆఖర్కి తినేతిండికి గుడ కొందరు గీ పేటీయం ద్వారానే చెల్లించుతున్నరు..దీంతోపాటు వివిధ రకాల ఆన్‌లైన్‌ సైట్‌లలో నుంచి షాపింగ్‌ చేస్తే కొన్ని పాయింట్‌లను గెలుచుకుని వీటిని తిరిగి పేటీయంలో ఉపయోగించుకోవచ్చు .డిజిటల్ పేమెంట్ విషయంల మస్తు ముందుంది పేటియమ్..ఇండియాల గీ పేటియమ్ ను ఉపయోగించెటోళ్లు 225 మిలియన్లు మంది అంటే.. 22 కోట్లకు మీదనే వాడుతున్నరట. కొత్తగ రాబోయే గీ పేటియం మెసెంజర్  వాట్సప్ కు గట్టి పోటీనిస్తదా లేక్పోతే తుస్సుమంటదా అనేది సూడాలె మరి.