పేటీఎం యూజర్లకు షాక్.. గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి ఔట్ - MicTv.in - Telugu News
mictv telugu

పేటీఎం యూజర్లకు షాక్.. గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి ఔట్

September 18, 2020

Paytm pulled from Google Play Store; Google says won’t allow gambling apps

ప్రముఖ డిజిటల్ పేమెంట్ల యాప్ పేటీఎం యూజర్లకు దుర్వార్త. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దాన్ని తొలగించారు. పదే పదే నిబంధనలను ఉల్లంఘించినందుకు దాన్ని తొలగించినట్లు గూగుల్ కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది. భారత్‌కు చెందిన పీటీఎం ప్రైమరీ యాప్ ప్రస్తుతం స్టోర్‌లో కనిపించడం లేదు. అయితే పేటీఎం మాల్, పేటీఎం మనీ వంటివి ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. 

గ్యాంగ్లింగ్ యాప్స్‌లను, ప్రైజ్ మనీ, ఇతర అక్రమాలకు పాల్పడే యాప్స్‌లను తొలగిస్తున్నామని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సుజానే ఫ్రే ప్రకటించిన నేపథ్యంలో పేటీఎంపై వేటు పడడం గమనార్హం. ‘యూజర్ల భద్రతకు, గోప్యతకు మేం కట్టుబడి ఉన్నాం’ అని ఆమె చెప్పారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎంను తీసేయడం మార్కెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీనిపై పేటీఎం కంపెనీ ఇంతవరకూ స్పందించ లేదు. నోట్ల రద్దు కారణంగా డిజిటల్ చెల్లింపులు పెరగడంతో పేటీఎం స్వల్ప కాలంలోనే వందల కోట్లు వెనకేసుకున్న సంగతి తెలిసిందే.