పేటీఎం యూజర్లు ఇప్పుడేం చెయ్యాలి? కంపెనీ ప్రకటన ఇదీ! - MicTv.in - Telugu News
mictv telugu

పేటీఎం యూజర్లు ఇప్పుడేం చెయ్యాలి? కంపెనీ ప్రకటన ఇదీ!

September 18, 2020

Paytm removed from Google Play Store: Why, what happens next and other key details

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తమ లావాదేవీల డేటా, వాలెట్ మనీపై యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరూ భయపడాల్సిన పని లేదని, అతి త్వరలోనే తిరిగి స్టోర్‌లోకి వస్తామని పేటీఎం కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త అప్ డేట్స్, డౌన్ లోడ్స్ వల్ల  తమ యాప్‌ను తొలగించాల్సి వచ్చిందని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపింది. యూజర్ల డబ్బులు భద్రంగా ఉంటాయని హామీ ఇచ్చింది. 

‘ఆండ్రాయిడ్ యాప్ తాత్కాలికంగా అందుబాటులో లేదు. త్వరలోనే తిరిగి వస్తాం. మీ డబ్బు భద్రంగా ఉంది.. ’ అని తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్‌లో లేకపోయినా యాపిల్ యాప్స్ స్టోర్‌లో పేటీఎం ప్రైమరీ యాప్ అందుబాటులో ఉంది కనుక యూజర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. గ్యాంబ్లింగ్ యాప్స్‌లను అడ్డుకోవడంలో భాగంగా గూగుల్ కొన్నాళ్లుగా కఠిన చర్యలు తీసుకుంటోంది. పేటీఎంకు ఈ విషయంలో చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడతో తీసిపారేసినట్లు తెలుస్తోంది.