పేటీఎం షేరు భారీ పతనం.. జీవితకాల కనిష్టం - MicTv.in - Telugu News
mictv telugu

పేటీఎం షేరు భారీ పతనం.. జీవితకాల కనిష్టం

March 22, 2022

ఆన్‌లైన్ పేమెంట్ సంస్థ పేటీఎం షేరు ధర భారీగా పడిపోయి జీవితకాల కనిష్టానికి చేరింది. గతేడాది ఐపీఓకు వచ్చిన సమయంలో వచ్చిన ధరతో పోల్చుకుంటే ఇప్పటివరకు షేరు ధర దాదాపు 72 శాతం క్షీణించింది. ఈ రోజు బాంబే స్టాక్ ఎక్సేంజీలో పేటీఎం షేరు ధర నాలుగు శాతానికిపైగా దిగజారి రూ. 541.15 వద్ద ముగిసి జీవిత కాల కనిష్టానికి చేరింది. సంస్థ మార్కెట్ విలువ రూ. 35,915 కోట్లకు పడిపోయింది. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ పేటీఎం లక్ష్యాన్ని రెండోసారి తగ్గించడంతో ధర పడిపోయిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. గతేడాది నవంబర్‌లో స్టాక్‌పై కవరేజీని 1200తో ప్రారంభించగా, గత నెలలో విలువ రూ. 700కు పడిపోయింది. ఈరోజు రూ. 450కి తగ్గిపోయింది. మరోవైపు తరుగుట పెరుగుట కొరకే అనే సామెతను గుర్తు చేస్తూ, త్వరలోనే పేటీఎం షేరు ధర పుంజుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.