పేటీఎం యూజర్లకు వాత.. వ్యాలెట్‌లో వేస్తే 2% చార్జీ  - MicTv.in - Telugu News
mictv telugu

పేటీఎం యూజర్లకు వాత.. వ్యాలెట్‌లో వేస్తే 2% చార్జీ 

October 16, 2020

Paytm Users Will Now Have to Pay 2% Fee on Topping up Paytm Wallet via Credit Card

వినియోగదారులకు మొబైల్ వ్యాలెట్ పేటీఎం మరో ఘలక్ ఇచ్చింది. చేతిలో డబ్బులు లేనప్పుడు చాలామంది క్రెడిక్ కార్డుల నుంచి పేటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసుకుంటారు. ఆ తర్వాత క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఈ ప్రక్రియకు ఇంతవరకు ఎలాంటి రుసుములు వసూలు చేయని పేటీఎం ఇకపై బాదుడుకు నడుం కట్టింది. పేటీఎం ద్వారా క్రెడిట్ కార్డు నుంచి వాలెట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే ఇకపై అధిక చార్జీలు చెల్లించుకోక తప్పదు. ఇప్పటిదాకా క్రెడిట్ కార్డు నుంచి పేటీఎం వాలెట్‌కు డబ్బులు పంపించుకోవడానికి అదనంగా ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు చార్జీలు చెల్లించుకోవాల్సిందే అంటోంది పేటీఎం. 

ఇకపై క్రెడిట్ కార్డు నుంచి పేటీఎం వాలెట్‌కు డబ్బులు పంపించుకోవాలంటే 2 శాతం అదనపు చార్జీలు చెల్లించుకోవాలి. అంటే క్రెడిట్ కార్డు నుంచి రూ.100 పేటీఎం వాలెట్‌కు పంపించుకోవాలనుకుంటే క్రెడిట్ కార్డు నుంచి రూ.102 ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పేటీఎం ఇప్పుడు క్రెడిట్ కార్డు నుంచి పేటీఎం వాలెట్ లోడ్ చేసుకుంటే 1 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ఇకపోతే పేటీఎం మొబైల్ వాలెట్‌కు వచ్చిన డబ్బులను తర్వాత బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా చార్జీలు చెల్లించుకోవాలి. అంటే ఇకపై క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు పేటీఎం ద్వారా బ్యాంక్ అకౌంట్‌కు పంపుకోవాలంటే చార్జీలు చెల్లించక తప్పని పరిస్థితి ఉంటుంది. ఇక పేటీఎం వాలెట్‌ను డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ సాయంతో లోడ్ చేసుకుంటే ఎలాంటి చార్జీలు వసూలు చేయదు. కాగా, ఇప్పుడు చాలామంది చేతిలో డబ్బులు లేనప్పుడు క్రెడిట్ కార్డు నుంచి డబ్బులను పేటీఎం కన్నా ఎక్కువగా టీ వ్యాలెట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.