Pd act on mim leader Syed Abdahu Kashaf involved in Raja Singh
mictv telugu

ఎంఐఎం నేతపై పీడీ యాక్ట్.. రాజాసింగ్ వివాదం

August 30, 2022

Pd act on mim leader Syed Abdahu Kashaf  involved in Raja Singh

మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు కఠిన శిక్ష పడే పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపడం తెలిసిందే. రాజాసింగ్‌ను విమర్శిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత సయ్యద్ అబ్దాహు కషఫ్‌పైనా పోలీసులు ఆ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతణ్ని చర్లపల్లి జైలుకు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాని డిమాండ్ చేస్తూ కషఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తెలిసిందే.
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాముడు, సీతలపై మునావర్ అసభ్య వ్యాఖ్యలతో కించపరచాడని, అతణ్ని హైదరాబాద్‌కు రానివ్వొద్దని అన్నారు. ఆ సందర్భంగా మహమ్మద్ ప్రవక్తపైనా వ్యాక్యలు చేశారు. కరడుగట్టిన నేరస్తులను, శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగించేవారిని పీడీ యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేసి ఏడాదిపాటు జైల్లో పెడతారు.