పేకాటపై పీడి యాక్ట్! 

పైసల మీద ఆశ, పత్తాలాట ఆడేలా చేస్తుంది. పేకాట ఆడి ఆస్తులు సంపాదించిన వారికంటే , పోగొట్టుకున్నవారే ఎక్కువగా కనిపిస్తారు. డబ్బు ఎక్కువైన బడాబాబులు పబ్బుల్లో,క్లబ్బుల్లో పేకాట ఆడుతుంటే, పొద్దంతా కూలీనాలి చేసి కష్టపడిన పైసల్ను పేకాట ఆడి, కుటుంబాలను ఆగం  చేస్తున్నవారు మరికొందరు. పేకాట మహమ్మారి గురించి అందరికి తెలసిందే. ఆఖరికి ఆడేవారికి కూడా తెలుసు.. ఒక్కసారి ఆ జబ్బు అంటుకున్నదంటే  భారతంలోని ధర్మరాజులా ఇంటిని భార్యను కూడా పందెంలో ఒడ్డేలా చేస్తుంది అని. అయినా కూడా పేకాట వ్యసనాన్ని అంత సులువుగా ఎవ్వరూ వదులుకోరు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే, రాష్ట్రంలో ఉన్న అన్ని పేకాట క్లబ్బులపై ఉక్కుపాదం మోపింది. అయినా కూడా చాలా చోట్ల పేకాటరాయుళ్లు తమ చేతివాటం చూపిస్తూనే ఉన్నారు. ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్న పేకాటపై, పీడి యాక్ట్ కింద  కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం యోచిస్తోంది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. పేకాటవల్ల చాలా కుటుంబాలు ఆగం అయ్యాయి. ఇకనుంచి పేకాట వల్ల ఇంకెవరి జీవితాలు నాశనం కావద్దని సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

SHARE