వేరుశనగలను పేదవాని బాదంగా చెబుతుంటారు. వేరుశెనగలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతిరోజూ గుప్పెడు వేరుశెనగలు తింటే ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి. చాలామంది సాయంత్రం టైం పాస్ కోసం స్నాక్స్ గా వీటిని తింటుంటారు. అయితే కొంతమందికి వేరుశెనగలు తింటే కొన్ని సమస్యలు వస్తాయి.
వేరుశెనగల్లో ప్రొటీన్స్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, వంటివి సమృద్ధిగా లభిస్తాయి. వీటిని తరచుగా తిన్నట్లయితే రక్తం గడ్డకట్టడాన్ని ఆపుతుంది. అంతేకాదు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో గుండె సంబంధింత సమస్యలు రావు. అధిక బరువు నుంచి బయటపడేస్తుంది.
శీతాకాలంలో ఈ లక్షణాలు ఉన్నవారు వేరుశెనగలు అస్సలు తినకూడదు.
1. గౌట్తో బాధపడుతున్న రోగులు:
గౌట్ అనేది ప్యూరిన్ మెటబాలిజం డిజార్డర్ వల్ల వచ్చే వ్యాధి. అధిక కొవ్వు ఆహారం యూరిక్ యాసిడ్ స్రావాన్ని ఇది తగ్గిస్తుంది. వ్యాధిని తీవ్రతరం చేస్తుంది. కాబట్టి గౌట్ రోగులు వేరుశెనగలను తినకూడదు.
2. జీర్ణక్రియకు సంబంధించి:
శరీరంలోని కొవ్వుల జీర్ణక్రియ, శోషణకు పైత్యరసం చాలా ముఖ్యమైంది. భోజనం తర్వాత జీర్ణక్రియ, శోషణను సులభం చేసేందుకు పిత్తాశయం నుంచి డ్యూడెనమ్ లోకి స్రవిస్తుంది. అధిక ప్రొటీన్, అధిక కొవ్వు ఆహారాలు పిత్తాశయం మీద తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. వేరుశెనగలో ఉండే నూనె కొవ్వు జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.
3.గ్యాస్ట్రిక్ అల్సర్, దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ రోగులు:
గ్యాస్ట్రిక్ తో బాధపడుతున్నవారు వేరుశెనగలకు దూరంగా ఉండాలి. ఈ రోగుల్లో చాలా మంది దీర్ఘకాలిక పొత్తికడుపు నొప్పి, అతిసారం లేదా అజీర్తి వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. అందుకే ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో నూనె,కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి. వేరుశెనగల్లో ప్రొటీన్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణం కావు. కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు వేరుశెనగలకు దూరంగా ఉండాలి.
4. బరువు తగ్గాలంటే :
వేరుశెనగల్లో కేలరీలు, కొవ్వు పుష్కలంగా ఉంటాయి. వేయించిన వేరుశెనగలు తినడం వల్ల శరీరంలో చాలా కేలరీలు స్టోర్ అవుతాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు వీటికి దూరంగా ఉండాలి.
5. హైపర్లిపోప్రొటీనిమియా ఉన్న రోగులు:
ఈ సమస్యతో బాధపడుతున్నవారు డైట్ థెరపీ కేలరీలు, సంతృప్త కొవ్వు ఆమ్లాలు, కొలెస్ట్రాల్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. వేరుశెనగల్లో అధిక కొవ్వు, అధిక కేలరీలు ఉంటాయి. ఇవి తింటే వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది. కరోనరీ హార్ట్ డిసీజ్, ఇతర గుండె సంబంధిత జబ్బులకు కూడా దారి తీయవచ్చు.