ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలంటారు పెద్దలు. ఇది సామాన్య మానవులకు వర్తిస్తుంది కానీ తమకు వర్తించదని మన రాజకీయ నాయకులు అంటుంటారు. ఇక మంత్రులైతే మరింత నిక్కినీలుగుతుంటారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలు ఈ విషయంలో మరికొన్ని ఆకులు ఎక్కువ చదివారు. మూడేళ్ల కిందట వియ్యంకులైన వీరు… తాజాగా తమ మనవడి బారసాలకు మతిపోయే కానుకలు తీసుకొచ్చారు.
అంగరంగ వైభవంగా జరిగిన బారసాలకు ఒక మంత్రేమో వెండి ఉయ్యాలను పట్టుకురాగా, మరో తాత తానే తక్కువా అన్నట్లు ముత్యాల ఉయ్యాలను సమర్పించుకున్నారు. ఎంత ఆస్తులుంటే మాత్రం ఇలా ఆడంబరాలకు పోతారా అని కార్యక్రమానికి హాజరైన అమ్మలక్కలు నోరు నొక్కుకున్నారట.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనవడి అక్షరాభ్యాసాన్ని వెండిబలపంతో చేయించడం తెలిసిందే. ఆ ఇద్దరు మంత్రులు బాబును ఆదర్శంగా తీసుకున్నట్టుంది.