ఎస్పీ సూట్‌కేస్‌ తనిఖీ చేస్తే.. ఇవి కనిపించాయి. - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్పీ సూట్‌కేస్‌ తనిఖీ చేస్తే.. ఇవి కనిపించాయి.

March 17, 2022

sp

కొన్ని సంఘటనలు చూస్తే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. యాధృచ్చికంగా జరుగుతాయా? లేక కావాలని చేస్తారో తెలియదు కానీ, మొత్తానికి వార్తల్లోకెక్కుతాయి. ఇలాంటి ఘటన రాజస్థాన్‌లోని జైపూర్ ఎయిర్‌పోర్టులో జరిగింది. వివరాలు.. సంతోష్ మిశ్రా అనే ఐపీఎస్ అధికారి విమానం ఎక్కేందుకు సూట్‌కేస్‌తో వెళ్తుండగా, ఎంట్రీ పాయింట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వచ్చి ఆపారు. సూట్‌కేస్‌ తెరచి చూపించాలని అడగ్గా, సంతోష్ సూట్‌కేసుని తెరవగానే అక్కడ ఉ్న సెక్యూరిటీ సిబ్బంది ఆశ్చర్యపోయారు. సూటుకేసు నిండా పచ్చి బఠాణీలు ఉన్నాయి. వాటిని రూ. 40 పెట్టి కొనుగోలు చేశానని చెప్పి ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే బఠాణీలను సూటుకేసు నిండా ఎందుకు తీసుకెళుతున్నారో ఆయన చెప్పలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.