కేంద్రానికి వ్యతిరేకంగా రైతు ఉద్యమం : కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రానికి వ్యతిరేకంగా రైతు ఉద్యమం : కేసీఆర్

March 21, 2022

 kcr

యాసంగి ధాన్యం కొనుగోలు, ఇతర పంటలకు మద్దతు ధర కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మార్చి 24, 25 తేదీల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ఎంపీలు పార్లమెంటులో రైతు సమస్యల గురించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆదేశించారు. రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అలజడులకు భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సర్వే పూర్తయిందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని భరోసా ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన యాదాద్రి ప్రారంభోత్సవం ఉందనీ, అందరూ హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు.