గొడుగుతో రాకుంటే జూబ్లిహిల్స్ పెద్దమ్మ దర్శనం బంద్  - MicTv.in - Telugu News
mictv telugu

గొడుగుతో రాకుంటే జూబ్లిహిల్స్ పెద్దమ్మ దర్శనం బంద్ 

August 2, 2020

Peddamma Temple Organizer New Rule .

లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత మెల్లగా ఆలయాలు తెరుచుకున్నాయి. మొదట్లో భక్తులు పరిమిత సంఖ్యలో వచ్చినా ఇప్పుడు వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందనే అభిప్రాయం కలుగుతోంది. దీనికి తోడు హైదరాబాద్ నగరంలో కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లిహిల్స్ పెద్దమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తులు వెంట గొడుగు తీసుకురాకుంటే లోపలికి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. 

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి. కానీ దర్శనానికి వచ్చే భక్తుల్లో చాలా మంది భౌతిక దూరం పాటించడం లేదు. ఇది ఆలయ నిర్వాహకులకు ఇబ్బందిగా మారింది. దీంతో త‌ప్ప‌నిస‌రిగా గొడుకు ఉండాల‌నే నిబంధ‌న‌ల‌ను తీసుకొచ్చారు. ఆల‌యంలో వెళ్లగానే గొడుగు తెరిచి పట్టుకోవాలి. దీని వల్ల ఎవరూ చెప్పకున్నా భౌతిక దూరం పాటించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. భక్తులు తప్పనిసరిగా ఈ సూచనలు పాటించాలని కోరారు. మొత్తానికి పెద్దమ్మ దర్శనం కావాలంటే చేతిలో గొడుగు ఉండాల్సిందేనన్నమాట.