సింగరేణి పేలుడులో ఐదుగురు కార్మికులు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

సింగరేణి పేలుడులో ఐదుగురు కార్మికులు మృతి

June 2, 2020

Peddapalli Coal Mine Incident

సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. పేలుడు కారణంగా ఐదుగురు కార్మికులు మరణించారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా సేంటినర్ కాలనీలోని ఓపెన్ కాస్ట్-1 మంగళవారం ఈ ఘటన జరిగింది. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

బ్లాస్టింగ్‌కు కావాల్సిన ముడి పదార్థాలను నింపుతుండగా ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించినట్టుగా అధికారులు వెల్లడించారు. మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం పంపించారు. పేలుడు తీవ్రతకు కార్మికుల శరీరాలు పూర్తిగా ఛిత్రమైపోయాయి. ఈ ఘటనపై పలువురు విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారంతా కాంట్రాక్టు కార్మికులని అధికారులు తెలిపారు.