పెగాసస్‌ను కొన్నది చంద్రబాబే: మమతా బెనర్జీ - MicTv.in - Telugu News
mictv telugu

పెగాసస్‌ను కొన్నది చంద్రబాబే: మమతా బెనర్జీ

March 18, 2022

ghmc

దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న పెగాసస్‌ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం బెంగాల్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. “ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు విక్రయిస్తామంటూ, దాని సృష్టికర్తలు బెంగాల్ పోలీసులను సంప్రదించారు. ఆ విషయం తెలిసిన వెంటనే నేను తిరస్కరించాను. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం దానిని కొనుగోలు చేసింది’ అని ఆమె వివరించారు. అంతేకాకుండా న్యాయమూర్తులు, అధికారులకు వ్యతిరేకంగా వినియోగించడంతోపాటు, రాజకీయంగా దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉండటంతో అప్పుడు తిరస్కరించామని అన్నారు. ఇలాంటివి ఆమోదయోగ్యం కాదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

మరి ఈ పెగాసస్ అంటే ఏమిటీ? ఎందుకు దేశవ్యాప్తంగా దీని గురించి ఇన్ని చర్చలు చేస్తున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే.. ‘పెగాసస్‌ అనేది ఇజ్రాయేల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ అనే సంస్థ తయారు చేసిన ఒక మొబైల్‌ స్పైవేర్‌ టూల్‌. ప్రత్యేక పరిస్థితులు, తీవ్రవాద అణిచివేత చర్యల్లో భాగంగా అనుమానిత వ్యక్తుల మీద నిఘా పెట్టడమే పెగాసస్‌ ముఖ్య ఉద్దేశం. దీనికోసం అది యూజర్లకు ఒక లింక్‌ పంపిస్తుంది. దాని మీద క్లిక్‌ చేస్తే చాలు, ఆ యూజర్‌ ఫోన్‌ పూర్తిగా ఎటాకర్‌ అధీనంలోకి వెళ్లిపోతుంది. యూజర్‌కు తెలీకుండానే పెగాసస్‌ టూల్‌ అతడి ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయిపోతుంది. ఒకసారి ఇన్‌స్టాల్‌ అయ్యాక ఫోన్‌కు సంబంధించిన డేటా అంతా ఎటాకర్‌కు పంపించడం మొదలుపెడుతుంది.