కారుపై 104 పెండింగ్ చలానాలు.. షాక్‌లో పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

కారుపై 104 పెండింగ్ చలానాలు.. షాక్‌లో పోలీసులు

May 8, 2019

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే జరిమానాలు ఏ విధంగా ఉంటాయో హైదరాబాద్ వాసులకు చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్ పోలీసులు విధించిన రూల్స్ సక్రమంగా పాటిస్తే పర్వాలేదు గానీ.. పొరపాటున రూల్స్ అతిక్రమిస్తే చలానాలు తడిసి మొపెడవుతాయని భయంతో బైక్, కారు నడుపుతుంటారు చాలామంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సార్లు చలానాలు పెండింగ్ ఉంటే బైక్, కారు బయటకు తీయాలంటేనే ఆలోచిస్తుంటారు. ఆ చలానాలు కట్టేవరకు వాహనాలను తీయని వాళ్లు కూడా ఉంటారు. కానీ హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కారుపై ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 104 పెండింగ్ చలానాలు ఉన్నాయి. అది చూసిన పోలీసులకు షాక్‌కు గురయ్యారు.

సింహేదర్ రావు అనే వ్యక్తి నగరంలో క్యాబ్ నడుపుతున్నాడు. కాగా మంగళవారం అతను గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ వద్ద నో పార్కింగ్ జోన్‌లో కారు పార్క్ చేశాడు. అది చూసిన ట్రాఫిక్ పోలీసులు అతనికి జరిమానా విధించారు. అదే సమయంలో ఆ వాహనంపై ఏమైన పెండింగ్ చలానాలు ఏమైన ఉన్నాయేమోనని చెక్ చేయడంతో ఆ కారుపై 104 చలానాలకు కలిపి మొత్తం రూ.17,805 చెల్లించాలని తేలింది. దీంతో డ్రైవర్ పై ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన పోలీసులు.. కారును సీజ్ చేశారు. అతణ్ణి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

మరో విషయమేంటంటే? ఇతనికి మించిన మరో వ్యక్తి కూడా నగరంలోని అబిడ్స్‌లో ఉన్నాడు. అతగాడి పేరు చీర వెంకటేశ్.. అతని బైక్ పై ఏకంగా 105 పెండింగ్ చలానాలు ఉన్నాయి. ఈ నెల 4వ తేదీన ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ.. పోలీసులకు చిక్కాడు దీంతో పోలీసులు బైక్ పై పెండింగ్ చలానాలను చెక్ చేయగా 105 పెండింగ్ చలానాలు అంటే మొత్తం రూ. 16,390 చెల్లించాల్సి ఉంది. ఇంత మొత్తంలో చలానాలు పెండింగ్ లో ఉన్నా… దర్జాగా పోలీసుల ముందే తిరిగుతున్నారు. ఇలాంటి వారు నగరంలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఎంత తప్పించుకుని తిరిగినా.. ఎప్పుడో ఒక రోజు పోలీసులకు చిక్కక తప్పదు. చలానా కట్టకా.. తప్పదు. అందుకే వీలైనంత త్వరగా పెండింగ్ చలానాలు కట్టుకుని కేసులు, కోర్టుల చుట్టు తిరగకుండా ఉండేలా చూసుకుంటే మంచింది అని పోలీసులు సూచిస్తున్నారు.