శుభవార్త.. శీఘ్రస్ఖలన సమస్యకు దివ్యౌషధం.. - MicTv.in - Telugu News
mictv telugu

శుభవార్త.. శీఘ్రస్ఖలన సమస్యకు దివ్యౌషధం..

February 16, 2019

మగవారి శృంగార అనుభవాలను దెబ్బతీసి, అసంతృప్తి మిలిల్చే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం వంటి సమస్యల పరిష్కారంలో మరో ముందడుగు పడింది. సాధారణ సెక్స్ సమయాన్ని రెట్టింపు, ముట్టింపు చేసే ఔషధాన్ని బ్రిటన్, ఈజిప్టు శాస్త్రవేత్తలు రూపొందించారు. దీన్ని వాడిన పురుషులకు శీఘ్రస్ఖలన సమస్య తొలగిపోయింది.

Penis injection made from LIP FILLERS could herald new treatment for premature ejaculation after it made men last three and a half times longer in the bedroom

పెదవుల సర్జరీ(లిప్ ఫిల్లర్స్), మాయిశ్చరైజర్లు, ఇతర సౌందర్య లేపనాల్లో వాడే హయలూరోనిక్ యాసిడ్(Hyaluronic acid) శీఘ్రస్ఖలనాన్ని నిరోధిస్తుందని  శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రయోగాల్లో భాగంగా ఈ సమస్యతో బాధపడుతున్న పురుషుల జననాంగానికి Hyaluronic acidను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చారు. తర్వాత వారి పడక అనుభవాలను పరిశీలించారు. ఇంజెక్షన్ తీసుకున్నవారు గతంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొంటున్నట్లు గుర్తించారు. అధ్యయనంలో పాల్గొన్న వారు గతంలో 30 సెకన్లకే జావగారిపోగా, ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలు పడకపై స్థిరంగా ఉన్నారు.

44

Hyaluronic acid పురుషాంగ సెన్సిటివిటీని తగ్గించి, స్పర్శను మొద్దుబార్చి, ఎక్కువ సేపు రాసలీలకు తోడ్పడుతున్నట్లు గుర్తించారు. Hyaluronic acid ఇంజెక్షన్‌ను నేరుగా పురుషాంగానికి ఇవ్వడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలూ ఉండవని అధ్యయనంలో పాల్గొన్న కైరో వర్సిటీ శాస్త్రవేత్త మహమ్మద్ రగాబ్ చెప్పారు.

rr

ప్రొస్టేట్ గ్రంధుల సమస్య, థైరాయిడ్, దీర్ఘకాలిక వ్యాధులకు మందుల వాడకం, మానసిక ఆందోళన, స్థూలకాయం, మద్యం, ధూమపానం వంటి వాటివల్ల పురుషుల్లో శీఘ్రస్ఖలనంతోపాటు అంగస్తంభన సమస్య కూడా వస్తుంటుంది. మగవారు ఎంతసేపు సెక్స్ చేస్తారని నిర్ణయించే ప్రమాణాలు ఇంతవరకు లేవు. సాధారణంగా 4 నిమిషాల నుంచి 8 నిమిషాలు చేస్తారని చెబుతుంటారు.