pensions will Increase from January : CM Jagan
mictv telugu

జనవరి నుంచి పింఛను పెంపు.. కుప్పంలో సీఎం జగన్

September 23, 2022

వచ్చే ఏడాది జనవరి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛను మొత్తాన్ని రూ. 2500 నుంచి 2750 కి పెంచుతున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. ప్రతీ ఏడాది పెంచుకుంటూ పోయి రూ. 3000 ఇస్తామని పునరుద్ఘాటించారు. శుక్రవారం కుప్పంలో వైఎస్సార్ చేయూత పథకం కింద బటన్ నొక్కి 26 లక్షల మంది ఖాతాలో మూడో విడత నగదు జమ చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. తమది మహిళల ప్రభుత్వం అని, తాము చేపట్టిన చర్యలతో మహిళల జీవితాల్లో మార్పు కనిపిస్తోందని అన్నారు. గడచిన మూడేళ్లలో రూ. 1.17 లక్షల కోట్లను జమ చేశామని వెల్లడించారు. పథకాల అమలులో లంచాలు లేవని, మధ్యవర్తులు లేరని, వివక్ష అసలే లేదని తెలిపారు. చంద్రబాబు పాలనకు తమ ప్రభుత్వ పనితీరును పోల్చి చూడాలని కోరారు. ఇన్నేళ్లలో కుప్పం సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలనే కనీస ఆలోచన చేయని చంద్రబాబు.. ఎన్నికల ముందు మాత్రం విమానాశ్రయం గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు.