హెల్మెట్ ధర రూ. 2.8 కోట్లు.. ఒకటే లోపం - MicTv.in - Telugu News
mictv telugu

హెల్మెట్ ధర రూ. 2.8 కోట్లు.. ఒకటే లోపం

November 12, 2019

హెల్మెట్ ధర ఎంత ఉంటుంది. మహా అయితే 2 లేదా 3 వేల రూపాయలు ఉంటుంది. బ్రాండెడ్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ, అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానం పైలెట్లు వాడే హెల్మెట్ ధర ఏకంగా 4 లక్షల డాలర్లు ఉంటుందట. మన కరెన్సీలో రూ.2.8 కోట్ల పైమాటే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హెల్మెట్ ఇదేనట. ఇందులో కూడా లోపముందట. హెల్మెట్‌ డిస్‌ప్లే స్క్రీన్‌లో బగ్ ఉన్నట్టు గుర్తించారు.

helmet.

ఈ బగ్ వల్ల తక్కువ వెలుతురు ఉన్న పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆకుపచ్చ మెరుపు కనిపిస్తోంది. దీనివల్ల ల్యాండింగ్ సమయంలో పైలెట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ లోపాన్ని సరిచేసేందుకు డిఫెన్స్ టెక్నాలజీ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్‌ కార్పొరేషన్‌కు పెంటగాన్ కాంట్రాక్ట్ అప్పగించింది. సెమీకండక్టర్ ఇల్యుమినేషన్‌ను ఉపయోగించి ఈ సమస్యను అధిగమించవచ్చని భావిస్తున్నారు. ఈ సమస్యను పెంటగాన్ టెస్ట్ ఆఫీస్ ‘ప్రియారిటీ వన్’గా గుర్తించింది. హెల్మెట్లలోని లోపాన్ని సరిచేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్న లాక్‌హీడ్ సంస్థ హెల్మెట్‌ను రీడిజైన్ చేయడంతోపాటు సంప్రదాయ లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే బదులు సరికొత్త ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డియోడ్స్‌ను వాడాలని నిర్ణయించినట్టు సమాచారం.