జగన్‌ను పీకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు: చంద్రబాబు - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌ను పీకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు: చంద్రబాబు

April 9, 2022

vbxvb

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డిపై శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ”ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంట్ పీకుతున్న జగన్‌ను.. ఆ పదవి నుంచి త్వరలోనే పీకడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అని అన్నారు. అంతేకాకుండా విద్యుత్ కోతలు, పెరిగిన కరెంట్ ఛార్జీలపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ”పరిశ్రమలకు విద్యుత్ కోతలతో కార్మికుల ఉపాధి పోతోందని, పంటలకు నీరందక రైతులు మరింత సంక్షోభంలోకి వెళ్లిపోతున్నారు. పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి కొవ్వొత్తి, అగ్గి పెట్టె, బాదుడే బాదుడు కరపత్రం పంపిణీ చేస్తున్నారు” అని చంద్రబాబు అన్నారు.

శనివారం ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంపై ఆన్‌లైన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. క్షేత్రస్థాయికి వెళ్లని నేతలను మార్చేందుకు వెనకాడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబుతోపాటు లోకేశ్, అచ్చెన్నాయుడు కూడా పాల్గొననున్నారు.

మరోపక్క జగన్‌పై నారా లోకేశ్ సైతం తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. బీహార్‌ రాష్ట్రంలో జరిగిన స్టీల్ బ్రిడ్జి దొంగతనం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ విషయంలో జగన్‌కు కూడా పిచ్చి, అవినీతి, అరాచకాలు, అసర్థమతలు పెరిగిపోయి రాబోయే తరాల భవిష్యత్‌ను దొంగిలిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సైతం జగన్‌పై మండిపడ్డారు.