సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా సినిమాలు చూడొచ్చు
ఇప్పుడంతా ఓటీటీ మేనియా నడుస్తోంది. జనాలు థియేటర్లకు వెళ్లడం చాలావరకు తగ్గించారు. అంతా ఓటీటీ బాట పట్టారు. దాంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆడియన్స్కు నచ్చే కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్లతో వస్తున్నారు. అయితే, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అందరి దగ్గరా ఉండవు. అందుకని చాలామంది పైరసీ సైట్లలో చూస్తుంటారు. దాంతో ఒరిజినల్ కంటెంట్ ప్రేక్షకులకు అందకుండా పోతుంది. అయితే, ఇప్పుడు ఒక్క రూపాయి కట్టకుండా ఫ్రీగా సినిమా చూసే అవకాశం వస్తే.. అలాంటి బంపర్ ఆఫర్ను ప్రకటించింది జియో సినిమా. కస్టమర్లను పెంచుకునే అంశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అందులో భాగంగానే సబ్స్క్రిప్షన్ లేకుండానే కొన్ని చిత్రాలను ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. తాజాగా రిలీజ్ అయిన.. హృతిక్- సైఫ్ నటించిన విక్రమ్ వేద, వరుణ్ ధావన్-కృతి సనన్ నటించిన భేదియా, బాబీ సింహా ప్రధాన పాత్రలో వచ్చిన థగ్స్, విశ్వక్-రకుల్ నటించిన ‘బూ’ చిత్రాలను జియో సినిమాలో ఫ్రీగా చూడొచ్చు. అయితే, ఈ అవకాశం ఎన్ని రోజులు ఉంటుందనేది మాత్రం జియో చెప్పలేదు.
ఇదివరకు ఆహా కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటించింది. కలర్ ఫొటో, క్రాక్, మసూద, డీజే టిల్లు లాంటి సినిమాలను తలా ఒక రోజు ఫ్రీగా స్ట్రీమింగ్ చేసింది. దీనిపై.. ఏ రోజు ఏ సినిమా రిలీజ్ అవుతుందని ట్విట్టర్ వేదికగా ప్రకటించేది. జీ5 కూడా కల్యాణ్ రామ్ నటించిన బింబిసార తొలి 15 నిమిషాలను ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ ఆఫర్స్ వల్ల ప్రేక్షకులు తరలివస్తారని కంపెనీల ఆశ.