ఆకలి కేకలు.. దోమల బర్గర్లు తింటున్న ప్రజలు - MicTv.in - Telugu News
mictv telugu

ఆకలి కేకలు.. దోమల బర్గర్లు తింటున్న ప్రజలు

May 28, 2022

చీకటి ఖండంగా పేరు గాంచిన ఆఫ్రికాలో పేదరికం తాండవిస్తోంది. తినడానికి తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. పేదరికం, నిరక్షరాస్యత, వనరుల లేమి, కరువులు వంటి వాటితో వారి పొట్టలు నకనకలాడుతున్నాయి. దీంతో వేరే దారిలేక దోమలను పట్టుకొని వాటిని బర్గర్లుగా చేసుకొని తింటున్నారు. అక్కడ దోమలకు కొదవ లేదు. మనతో పోలిస్తే భారీ సంఖ్యలో దోమలు ఉంటాయి అక్కడ. అయితే ఒక్క బర్గర్ తయారు కావాలంటే సుమారు ఐదు లక్షల దోమలు అవసరమవుతాయి. ఈ స్థాయిలో దోమలను పట్టాలంటే కొద్దిగా రిస్కే. కానీ, ఆఫ్రికన్ వాసులు దీనికి ఓ టెక్నిక్ కనిపెట్టారు. మనం కేజీ బియ్యం వండుకునేంత సైజులో ఉన్న గిన్నెలలో కొంత ఆయిల్ పోసి వాటిని దోమలు ఉన్న ప్రాంతంలో అటూ ఇటూ ఊపుతారు. దీంతో చాలా వరకు దోమలు గిన్నెకు అతుక్కుంటాయి. అలా అతుక్కున్న దోమలను ముద్దలుగా చేస్తారు. అనంతరం పెనం మీద కొంచెం నూనె పోసి దోమల ముద్దలను అందులో వేయిస్తారు. అంటే మనకు ఫ్రైలాగా అన్నమాట. ఇవి తింటే క్రంచీగా ఉంటాయి. ఇలా ఒక్కో మనిషి రోజుకు రెండు బర్గర్లు తింటే మంచి పోషకాలు శరీరానికి అందుతాయని వారి నమ్మకం. అంతేకాక, ఇవి త్వరగా జీర్ణమవుతాయి కూడా.