‘బాహుబలి’ సినిమాలోని అంగరంగవైభవాల మాహిష్మతి సామ్రాజ్యాన్ని అందరు చూసిన్రు గదా. అది ఎక్కడో లేదు.. రామోజీ ఫిలిం సిటీలనే ఉంది. బాహుబలి సినిమాకోసం రాజమౌళి రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగులతో మాహిష్మతి సామ్రాజ్యాన్ని కట్టించాడు. ‘బాహుబలి’ రెండు భాగాలూ థియేటర్లకు వచ్చి పోయినా కూడా రామోజీ ఫిలిం సిటీలో మాహిష్మతి సామ్రాజ్యం సెట్లను మాత్రం అలాగే ఉంచారు. ఈ సామ్రాజ్యాన్ని సందర్శించే అవకాశాన్ని నిర్వాహకులు ఇప్పుడు సామాన్యుల కూడా కలిపించారు. బాహుబలి అభిమానులు ఆ సామ్రాజ్యాన్ని చూసేందుకు రామోజీ ఫిలిం సిటీ లో క్యూ కడుతున్నారు.