People filed a case against the teacher who misbehaved with the girls
mictv telugu

బడిలో టీచర్ సిగ్గుమాలిన పని.. చెప్పుల దండతో సత్కరించిన ప్రజలు

September 30, 2022

People filed a case against the teacher who misbehaved with the girls

పవిత్రమైన గురు, శిష్యుల బంధానికి ప్రతీకగా నిలిచిన భారతదేశంలో గురువులు దారి తప్పుతున్న సంఘటనలు ఆధునిక కాలంలో చోటు చేసుకుంటున్నాయి. అభం శుభం తెలియని మైనర్ పిల్లలతో అసభ్యకర ప్రవర్తనతో ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు.

ఇలాంటి కొన్ని ఘటనలు కొన్ని బయటపడుతుండగా, వెలుగులోకి రానికి ఇంకెన్ని ఉంటాయో. తాజాగా విద్యార్ధినులకు అశ్లీల వీడియోలు చూపిస్తున్న ఓ టీచరకు గ్రామ ప్రజలు తగిన బుద్ధి చెప్పిన సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. పశ్చిమ సింగభూమ్ జిల్లా పరిధిలోని బరజండ్ ఓపీ పరిధిలోని ఖాస్టమ్డా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి టీచరుగా పని చేస్తున్నాడు. అయితే రోజూ పాఠశాలకు వచ్చే విద్యార్ధినులను ఒళ్లో కూర్చోబెట్టుకుని అశ్లీల వీడియోలు చూపించేవాడు. వారు బాత్రూంకి వెళ్తే వారి వెంటే బాత్రూంకి వెళ్లేవాడు. ఇదేంటని ప్రశ్నిస్తే కొట్టేవాడు. ఇతని ప్రవర్తనతో విసిగిపోయిన బాలికలు విషయాన్ని తమ పేరెంట్స్‌కి చెప్పడంతో వారు ఆగ్రహించి ప్రేమ్ కుమార్‌ని దొరకబుచ్చుకున్నారు. అనంతరం అతని ముఖానికి మసి పూసి మెళ్లో చెప్పుల దండ వేసి ఊరేగించారు. తర్వాత స్థానిక పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయించారు. అంతటితో ఆగక, సిగ్గుమాలిన పని చేసిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్‌కి లేఖ రాశారు. అటు ప్రేమ్ కుమార్‌పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.