లారీ హారన్‌కు ఫిదా.. ఆపి మరీ కొట్టించుకుంటున్నారు.. - MicTv.in - Telugu News
mictv telugu

లారీ హారన్‌కు ఫిదా.. ఆపి మరీ కొట్టించుకుంటున్నారు..

February 27, 2020

fbcb

వాహనాలు పదేపదే హారన్ కొడితే చిరాకు పడతాం.. ట్రాఫిక్‌లో అయితే కొందరు కావాలనే కొడుతూ వేధిస్తారు.  హార్న్ సౌండ్ ఎక్కువగా ఉంటే శబ్ద కాలుష్యం అవుతుందని గగ్గోలు పెడతారు. కానీ, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఇందుకు విరుద్ధంగా జరిగింది. ప్రజలే లారీని ఆపి మరి మరోసారి హార్న్ కొట్టమని అడిగారు. 

దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. పంజాబ్ రాష్ట్రం వెళితే ఇలాంటి లారీలు 3600 ఉంటాయని ఓ నెటిజన్ ట్వీట్ పెట్టాడు. 2020లో గాల్లో ఎగిరే కార్లు వస్తాయని చిన్నప్పుడు విన్నాను.. కానీ ప్రజలు ఇంకా లారీ హార్న్ వెనకాలే పడుతున్నారని ఇంకో నెటిజన్ ట్వీట్ చేశాడు. అయితే, ఆ లారీ హార్న్ 1975లో విడువులైన ప్రతిగ్య అనే సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘మై జట్  యంలా పగ్లా దీవానా’ ట్యూన్ అని అందుకే ప్రజలు దేనికి కనెక్ట్ అయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.