2.4 లక్షల ఏటీఎంలలో మార్పులు.. ఇబ్బంది ఉండదట - MicTv.in - Telugu News
mictv telugu

 2.4 లక్షల ఏటీఎంలలో మార్పులు.. ఇబ్బంది ఉండదట

February 28, 2020

Rs 2000

ఏటీఎంలలో రూ.2,000 నోట్లు తగ్గుతున్నాయని, వాటిలో మార్పులు చేస్తుండడంతో విత్ డ్రాలకు ఇబ్బంది కలుగుతుందని వస్తున్న వార్తలపై  ఎఫ్ఐఎస్ ఎండీ (బ్యాంకింగ్ సొల్యూషన్స్-ఏపీఎంఈఏ) మహేష్ రామమూర్తి స్పందించారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. 

ఏటీఎంలలో కరెన్సీ మార్పు వల్ల కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యమూ ఉండదని స్పష్టం చేశారు. ‘త్వరలో భారత్‌లోని 2,40,000 ఏటీఎం కేంద్రాల్లో రీకాలిబ్రేషన్ (మార్పు) చేయనున్నాం. ఈ ప్రక్రియలో భాగంగా రూ.2,000 నోట్లు ఉంచే డబ్బాలను మాార్చి వాటి స్థానంలో రూ.500 నోట్ల డబ్బాలను పెడతాం.  ఈ కార్యక్రమం బ్యాంకులకు, ఏటీఎం నిర్వాహకులకు భారీ కసరత్తు కానుంది. దీంతో కస్టమర్లు ఏటీఎంల నుంచి ఎక్కువసార్లు విత్ డ్రా చేసుకోవచ్చు. బ్యాంకులతో సంప్రదింపుల అనంతరం ఈ చర్యలు చేపడతాం. ఏటీఎం విత్ డ్రాల సంఖ్యకు అనుగుణంగా ప్రతిఫలాన్ని పొందే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFC) కూడా దీని వల్ల ప్రయోజనం పొందుతాయి. ఈ విషయంలో కస్టమర్లతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని మహేష్ రామమూర్తి అన్నారు.