అన్ని మతాల వారు యూనిఫాంలు ధరించాల్సిందే: అమిత్ షా - MicTv.in - Telugu News
mictv telugu

అన్ని మతాల వారు యూనిఫాంలు ధరించాల్సిందే: అమిత్ షా

February 22, 2022

02

భారతదేశంలో గత కొన్ని రోజులుగా ప్రకంపనలు సృష్టిస్తున్న ‘హిజాబ్’ వివాదంపై మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. “పాఠశాలలకు వచ్చే విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడం కంటే, యూనిఫాంను ధరించి స్కూలుకు రావడానికే నేను మద్దతు ఇస్తున్నా. దేశంలోని అన్ని మతాల వారు స్కూలు యూనిఫాంలనే ధరించాలి. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. అయితే, హిజాబ్‌పై నిషేధం పట్ల కర్ణాటక హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నా అభిప్రాయం మారొచ్చు” అని అమిత్ షా అన్నారు. కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉన్నా తాను గౌరవిస్తానని ఆయన తెలిపారు.

మరోపక్క కర్ణాటకలో విద్యా సంస్థలకు ముస్లిం విద్యార్ధినులు హిజాబ్ ధరించి రావడంపై కొన్ని పాఠశాలలు, కాలేజీలలోకి అనుమతించకపోవటంతో తీవ్ర నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. దేశంలో రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలో, ఇష్టానుసారం నడుచుకోవాలో తేలాల్సి ఉందని అమిత్ షా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.