పాలకులకు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు - MicTv.in - Telugu News
mictv telugu

పాలకులకు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు

February 25, 2020

P Chidambaram

కనికరం లేని పాలకులను ఎన్నుకున్నందుకు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ‘దయలేని, ముందుచూపు లేని పాలకులను ఎన్నుకున్నందుకు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. పౌరసత్వ సవరణ చట్టం కారణంగా తీవ్ర కల్లోలాలు చెలరేగుతాయని మేము ముందే చెప్పాం. సీఏఏను వెనక్కితీసుకోవాలని హెచ్చరించినా కేంద్రం మంకు పట్టు పట్టినట్టు పట్టింది. సీఏఏకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆందోళనకారుల గోడు కేంద్రం వినాలి. సీఏఏ చెల్లుబాటు అవుతుందో లేదో సుప్రీంకోర్టు నిర్ణయించేవరకు ఈ చట్టాన్ని నిలుపుదల చేయాలి’ అని చిదంబరం అన్నారు.