జేబీఎస్ వద్ద ప్రయాణికులు పడిగాపులు..(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

జేబీఎస్ వద్ద ప్రయాణికులు పడిగాపులు..(వీడియో)

May 19, 2020

People Waiting For Bus in JBS Bus Stop

లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో తెలంగాణలో ఆర్టీసీ సేవలు ప్రారంభం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో డిపోల నుంచి బస్సులు రోడ్డెక్కాయి. కానీ హైదరాబాద్ నుంచి మాత్రం ఇంకా బస్సు సర్వీసులు ప్రారంభం కాలేదు. జేబీఎస్ వద్దకు ఉదయం నుంచే ప్రయాణికులు చేరుకుంటున్నా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గంటల తరబడి వేచి చూస్తూ.. తమ గమ్య స్థానాలకు ఎప్పుడు చేరుకుంటామోనని పడిగాపులు కాస్తూనే ఉన్నారు. 

ఈ క్రమంలో చాలా మంది అసహనానికి గురౌతున్నారు. ఓ దశలో డిపో అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఉదయం నుంచే ప్రారంభం అవుతాయని చెప్పినా ఇంకా ఎందుకు నడపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం ఉదయం 10 తర్వాత నుంచి అందుబాటులోకి తెస్తామని అంటున్నారు. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. కాగా ఇప్పటికే హైదరాబాద్‌లో చిక్కుకున్నవారు, అత్యవసర ప్రయాణాలు చేసే వారు బస్టాండులకు చేరుకుంటూనే ఉన్నారు. మరోవైపు అధికారులు, బస్టాండులు, బస్సులను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. ప్రయాణికులు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.