హృతిక్‌ చూస్తున్నావా ఇతణ్ని.. పోటీ పడతావా? - MicTv.in - Telugu News
mictv telugu

హృతిక్‌ చూస్తున్నావా ఇతణ్ని.. పోటీ పడతావా?

May 18, 2020

TikTok

టిక్‌టాక్‌లో అర్మాన్ రాథోడ్ అనే వ్యక్తి చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్‌ హీరో హృతిక్ రోషన్ నటించిన కభీ ఖుషి కభీ ఘమ్చిత్రంలోని యు ఆర్ మై సోనియాఅనే పాటకు అర్మాన్‌ రాథోడ్‌ టిక్‌‌టాక్‌లో డాన్స్‌ ఇరగదీశాడు. హృతిక్‌ స్టైల్‌కి ఏమాత్రం తీసిపోకుండా అతను చాలా అద్భుతంగా డాన్స్‌ చేశాడు. అతని డాన్స్‌కు ఫిదా అయిన రోజీ అనే ట్విటర్‌ యూజర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ట్విటర్‌ అర్మాన్‌ను ఫేమస్‌ చేస్తుంది‘ అని పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. దీంతో అతను రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. 

అర్మాన్‌ చేసిన డాన్స్‌ను నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఆతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు అర్మాన్‌ చేసిన మరో సూపర్‌ డాన్స్‌ టిక్‌టాక్‌ వీడియోను రోజీ పోస్ట్‌ చేసి అతనికి అసాధారణమైన డాన్స్‌ టాలెంట్‌ ఉందిఅని స్టేటస్ పెట్టారు. దీంతో నెటిజన్లు అతని టిక్‌టాక్ ఐడీకి వెళ్లి హార్ట్స్, కామెంట్లతో ముంచెత్తుతున్నారు. దీంతో అతని వీడియోకు మిలయన్ల వ్యూస్ వస్తున్నాయి. ఫాలోవర్లు కూడా అమాంతం పెరిగిపోయారు. వాట్‌ ఏ ఖాతర్నాక్‌ డాన్సర్‌’‍ అని నెటిజన్లు అతనికి ఫ్యాన్స్ అయిపోయారు. ‘అతను హృతిక్ రోషన్‌ డాన్స్‌ను అచ్చం దించేశాడు. సాక్షాత్తు హృతిక్ కూడా ఇతనితో పోటీ పడలేడేమో’ అని అంటున్నారు. అర్మాన్ ఇవే కాకుండా హృతిక్ రోషన్‌కి సంబంధించిన పలు పాటలకు డాన్స్‌ చేస్తూ టిక్‌టాక్‌ వీడియోలు చేశాడు. అతను చేసిన అన్ని డాన్స్‌ వీడియోలు ఇప్పుడు వరుసగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఇప్పుడు టిక్‌టాక్ పుణ్యమా అని అర్మాన్ లాంటివారు ఎందరో తమ టాటెంట్ నిరూపించుకుంటున్న విషయం తెలిసిందే.