కాళ్లకింది నేల కుంగిపోవడం అంటే ఇదే. వరదలతో అతలాకుతలం అవుతున్న బిహార్ లో ఓ వంతెన కూలిపోతున్న దృశ్యం మీడియాలో వైరల్ అయింది. అరారియా జిల్లాలో ప్రజలు వరదముప్పు నుంచి తప్పించుకోవడానికి ఓ వంతెనపై నుంచి గుంపులు గుంపులుగా పరిగెడుతుండగా వంతెన ఉన్నట్టుండి కుంగిపోయింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా ముగ్గురు కిందపడి నీళ్లలో కొట్టుకుపోయారు. వీరు ముగ్గురు మరో ఒక్కడ అడుగు ముందుకేసి ఉంటే వంతెన దాడి ప్రాణాలతో బయపటడేవారు.
ఈ వంతెన చాలాకాలంగా మరమ్మతులతో నోచుకోలేదని స్థానికులు చెబుతున్నారు. వరద బీభత్సానికి ఒక్క అరారియా జిల్లాలోనే 20 మంది చనిపోయారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల్లో ఇప్పటివరకు పదుల సంఖ్యలో జనం చనిపోయారు. 16 జిల్లాల్లో కోటి మంది కొంపాగోడూ వదలి సురక్షిత స్థావరాలకు చేరుకున్నారు.