People were in awe of this beautiful Afghan cricket fan, photos are setting fire on social media
mictv telugu

అఫ్గానిస్తాన్‌తో ఇండియా మ్యాచ్‌కి ఆ అమ్మాయి వస్తుందా?

September 2, 2022

టీ20 ఆసియా కప్‌లొ భాగంగా అండర్ డాగ్ గా అడుగుపెట్టిన అఫ్గానిస్తాన్ జట్టు పటిష్ట జట్లపై విజయాలు సాధిస్తోంది. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి పటిష్ట జట్లపై గెలిచిన అఫ్గానిస్తాన్ సూపర్ -4 కు సాధించింది. తరువాతి మ్యాచ్ ఈ నెల 8 న టీమిండియాతో జరుగనుంది. అయితే క్రికెట్ అభిమానులంతా ఆ రోజు జరగబోయే మ్యాచ్ కోసం వేయి కళ్లతో అభిమానిస్తున్నారు. అందుకు కారణం మ్యాచ్ ఒక్కటే కాదు. ఓ అందమైన అమ్మాయి కూడా. కొద్ది రోజుల క్రితం అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌కి ఓ అందగత్తె హాజరైంది. ఆమె అందానికి ఆరోజు స్టేడియానికి వచ్చిన వారితో పాటు టీవీల్లో మ్యాచ్‌ చూసినవారు కూడా ఫిదా అయ్యారు.

సర్వత్రా చర్చగా మారిన ఈ ముద్దుగుమ్మ పేరు.. వాజ్మా అయూబీ. అఫ్గానిస్తాన్ అభిమాని అయిన వాజ్మా బౌండరీ లైన్ వద్ద అఫ్గాన్ జెండా పట్టుకొని ఆటగాళ్లతో పాటు వీక్షకులను తన అందంతో కట్టిపడేస్తోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ గెలిచిన తర్వాత అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపింది. సాధారణంగా క్రికెటర్లను తప్ప మిగతా ఎవరినీ పట్టించుకోని టీమిండియా అభిమానులు కూడా వాజ్మా అయూబీ అందానికి ముగ్దులవుతున్నారు.

”టీమిండియా అఫ్గానిస్తాన్ మ్యాచ్‌కు కూడా వస్తారా..” అంటూ భారత్ అభిమానులు ఆమెకు కామెంట్ చేస్తుండటం విశేషంగా మారింది. ఇలా వాజ్మా అయూబీ తన అందచందాలతో రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది. టీమిండియా అఫ్గానిస్తాన్ మ్యాచ్‌కు ఆమె వస్తుందో లేదో తెలియదు కానీ.. ఒకవేళ వాజ్మాఅయూబీ హాజరైతే మాత్రం అందరి కళ్లు ఆమె వైపే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.