దసరా ఉత్సవాల్లో భాగంగా ఓచోట అపశృతి చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా విజయదశమి సందర్భంగా రావణ దహనం కార్యక్రమాలు నిర్వహించారు. ఓచోట రావణున్ని దహనం చేస్తుండగా పేలిపోయింది. దీంతో భారీగా పేలుళ్లు సంభవించాయి. అక్కడున్నవారంతా ఏం జరుగుతుందో తెలియకుండా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పంజాబ్లోని బాటాలాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా బటాలాలోని డీఏవీ పాఠశాల సమీపంలోని మైదానంలో ఆదివారం రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ దృశ్యాలను చూసేందుకు అక్కడికి భారీగా జనాలు తరలివచ్చారు. కొందరు ముందుకు వెళ్లి రావణ దిష్టిబొమ్మకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు.
వారు నిప్పు పెడుతున్న సమయంలోనే దిష్టిబొమ్మ లోపల ఉన్న పటాకులు పేలాయి. దీంతో అక్కడ భారీ ఎత్తున మంటలు, శబ్దాలు, పొగలు ఎగసిపడ్డాయి. ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలో పడ్డారు జనాలు. వెంటనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడినుంచి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో చిన్నపాటి తొక్కిసలాట జరగడంతో కొందరు కిందపడిపోయారు. వారిని అక్కడున్న పైకి లేపారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ కార్యక్రమం కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే అశ్వానీ సేఖ్రి ఆధ్వర్యంలో జరిగినట్టుగా సమాచారం. దసరా కమిటీ, స్థానిక నాయకులతో కలిసి ఆయన ఈ వేడుకలను నిర్వహించారని తెలుస్తోంది.
https://www.facebook.com/arvinder.bhurjee/videos/3562913067064799/?t=13