టిక్‌టాక్ నిషేధాన్ని తప్పుబట్టిన యువ ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్ నిషేధాన్ని తప్పుబట్టిన యువ ఎంపీ

July 1, 2020

TikTok

టిక్ టాక్ తో సహా 59 చైనా మొబైల్ యాప్ లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెల్సిందే. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యువ ఎంపీ నుస్రత్ జహాన్ తప్పుబట్టారు. దీనిని ప్రభుత్వ తొందరపాటు చర్యగా అభివర్ణించారు. ఈరోజు పశ్చిమ బెంగాల్ రాజధానిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణ రథయాత్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 

తరువాత మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఒక వర్గం ప్రజలు సమర్ధించినా.. నిషేధం వల్ల ఉపాధి కోల్పోయిన వారి పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ నిషేధం వల్ల దేశంలో జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం దగ్గరున్న వ్యూహాత్మక ప్రణాళిక ఏమిటని అడిగారు. ఒకప్పుడు నోట్ల రద్దు వల్ల ఇబ్బంది పడినట్లే.. ఇప్పుడు టిక్‌టాక్ నిషేధం వల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి నిషేధంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, టిక్‌టాక్ ని ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నవారి పరిస్థితి గురించి నేను మాట్లాడుతున్నాను అని అన్నారు.