కూరగాయల్లో రారాజు ఏంటంటే అందరూ టక్కున చెప్పే సమాధానం వంకాయ. రుచి అద్భుతంగా ఉండే వంకాయ అంటే ఇష్టపడని వారు సాధారణంగా ఉండరు. అందుకే వంకాయ మీద పద్యాలు, పాటలు అన్నీ పుట్టుకొచ్చాయి. అయితే వంకాయను అందరూ తినకూడదట. వంకాయ తింటే కొంత మందికి దురదలు వస్తాయి అంటారు. అలాగే కొన్ని ప్రాబ్లెమ్స్ ఉన్నవాళ్ళు వంకాయ తినకూడదని చెబుతున్నారు. మరి ఎవరు ఈ రారాజును తినకూడదో తెలుసుకుందాం రండి.
వంకాయల్లో బోలెడు రకాలున్నాయి. రంగులను బట్టి వంకాయ టేస్ట్ కూడా మారుతుంటుంది. ఏ వంకాయ అయినా రుచి మాత్రం అదుర్సే. వంకాయ తినడం వలన ఆరోగ్య సమస్యలు అయితే రావు కచ్చితంగా కానీ…. ఆల్రెడీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అస్సలు తినొద్దని చెబుతున్నారు.
గర్భంతో ఉన్నవారు:
ప్రెగ్నెంట్ గా ఉన్నప్పడు వంకాయను అవాయిడ్ చేయడమే మంచిని వైద్యులు సూచిస్తున్నారు. అమెనోరియా, నెలసరి సమస్యలు ఉన్నవారిని వంకాయ తినమని సలహా ఇస్తారు కాబట్టి గర్భంతో ఉన్నవారు తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు.
ఇన్ డైజేషన్:
జీర్ణవ్యవస్థ సరిగ్గా లేనివారు వంకాయను తినకూడదు. వంకాయ తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకే ఇన్ డైజేషన్ ఉన్నవారు వంకాయను అవాయిడ్ చేయాలి.
అలెర్జీ:
వంకాయలో అలెర్జీని కలిగించే గుణం ఉంది. ఏదైనా ఫుడ్ అలెర్జీ ఉన్నా, చర్మ సంబంధిత సమస్యలు ఉన్నా వంకాయ అస్సలు తినకూడదు.
కళ్ళ సమస్య:
కళ్ళు బాగోలేనప్పడు వంకాయ తినకూడదు. కళ్ళ మంట, వాపుగా ఉంటే దీన్ని అవాయిడ్ చేయాలి. లేకపోతే అవి మరింత ఎక్కవయ్యే ప్రమాదం ఉంది.
డిప్రెషన్:
ఒత్తిడి, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు వంకాయ తినకూడదు. ఈ కూరగాయ రోగులలో మరింత ఆందోళనను పెంచుతుంది. అంతేకాదు దానికి సంబంధించిన మంుదల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.
రక్తహీనత:
శరీరంలో రక్తం తక్కువగా ఉంటే వంకాయ అస్సలు తినకూడదు. వంకాయలోని గుణాలు శరీరంలో రక్తం వృద్ధికి అడ్డంకిగా మారుతాయి.
హేమరాయిడ్:
పైల్స్ తో బాధ పడుతున్నవారు వంకాయకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి సమస్యను మరింత పెంచుతాయి.
రాళ్ళు:
మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటే వంకాయ తినకూడదు. వంకాయలో ఉండే ఆక్సలేట్ రాళ్ళ సమస్యను ఇంకా తీవ్రతరం చేస్తుంది.