పార్లమెంటులో  రోబో సాక్ష్యం.. చరిత్రలో తొలిసారి - MicTv.in - Telugu News
mictv telugu

పార్లమెంటులో  రోబో సాక్ష్యం.. చరిత్రలో తొలిసారి

October 16, 2018

రోబోలు మనుషులకు ప్రత్యామ్నాయాలు మరిపోతున్నాయి. పనుల్లోనే కాదు కేసులు, విచారణల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఓ చిట్టి రోబో పార్లమెంటులో ఎంపీలకు సాక్ష్యమిచ్చి చరిత్ర సృష్టించింది. బ్రిటన్ పార్లమెంటులో ఈ వింత చోటు చేసుకుంది.

స్కూళ్లలో, వృద్ధుల సంరక్షణలో కృత్రిమ మేధ ప్రభావం గురించి విచారణ జరుపుతున్న విద్యాకమిటీ ఎంపీల ముందు పెప్పర్ అనే  హ్యూమనాయిడ్ ఆడ రోబో హాజరైంది. కమిటీ సభ్యులు అడిగి ప్రశ్నలకు చకచకా బదులిచ్చింది. అమెరికన్ యాసతో మాట్లాడిన పెప్పర్.. కృత్రిమ మేధపై తన వాదనలు వినిపించింది. ‘గుడ్ మానింగ్ చైర్, నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.. నేను మిడిల్‌సెక్స్ వర్సిటీ నివాసిని. నాలాంటి మరో రోబో కూడా అక్కడొకటుంది. వృద్ధుల సంరక్షణకు సంబధించిన పరిశోధనలో అది పాల్గొంటోంది…’ అని ఏవోవో విరాలు చెప్పింది. పెప్పర్ ప్రశ్నలకు ఏమాత్రం తొణక్కుండా జవాబు చెప్పడంతో దాన్ని ఎంపీలు అభినందాంరు. ఈ వీడియోనూ మీరూ చూడండి..