per month rs. 5999 Super chance to own a 7-seater family Triber car by paying
mictv telugu

నెలకు రూ. 5999చెల్లించండి…ఈ కారు సొంతం చేసుకోండి..ఎలాగో తెలుసా..!

January 12, 2023

per month rs. 5999 Super chance to own a 7-seater family Triber car by paying

ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్ కు వెళ్తే ఆ మజానే వేరు కదా. ఫ్యామిలీ అంతా కూడా ఒకే కారులో వెళ్లాలంటే…కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు 7 సీటర్ ఎంపీవీ కార్లు ఎక్కువగా సీటింగ్ కెపాసిటీ పరంగా అనుకూలంగా ఉంటున్నాయి. అయితే సాధారణ ప్రజలు మాత్రం ఈ ఎంపీవీ కార్ల ధరలు ఎక్కువగా ఉంటాయనుకుంటారు. కానీ తక్కువ ఖర్చుతో కూడా ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో వెళ్లే కల నెరవేర్చుకోవచ్చు. ఎలాగో తెలుసా.

ఫ్రెంచ్ కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ తయారీదారు సంస్థ అయిన రెనాల్ట్ కంపెనీ తన 7 సీటర్ కారు ట్రైబర్ పై ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్స్ ను అందిస్తోంది. ఈ కారు ధర రూ. 6 లక్షల నుంచి 8. 63లక్షల వరకు ఉంటుంది. కారు పరిమాణం పెద్దగా ఉంటుంది. ఈ ఎంపీవీ కారును తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం ట్రైబర్ మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఆఫర్ , నిబంధనలు:
ఈ కారుకు సంబంధించిన ఆఫర్, నిబంధనలు కంపెనీ అధికారిక వెబ్‎సైట్‎లో అందించారు. ఈ కారును మీరు కేవలం నెలకు రూ. 5,999రూపాయలు చెల్లించి ఇంటికి తీసుకోవచ్చు. మొత్తం 84 నెలల పాటు ఫైనాన్స్ సదుపాయం ఉంటుంది. లోన్ మొత్తం మారినట్లయితే ఈఎంఐ కూడా మారిపోతుంది. ఈ ఆఫర్ లో ఎలాంటి ఉపకరణాలు లేదా ఇతర ఖర్చులు వర్తించవు. ఇవే కాకుండా ఈ ఫైనాన్స్ రెనాల్ట్ ఫైనాన్స్ ద్వారా కూడా చేయబడుతుంది.

రెనాల్ట్ Triber ఫీచర్స్:
ఈ కారు 7సీట్ల కాన్ఫిగరేషన్ తో వస్తుంది. ఈ కారులో 72పీఎస్ పవర్, 96ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 1 లీటర్ సహజసిద్ధమైన, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్‎మిషన్ గేర్‎బాక్స్ అమర్చబడి ఉంటుంది. అంతేకాదు ఈ కారు 1 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‎తో వస్తుంది. దీని ఇంజిన్ 100పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మీరు మూడు వరుసల సీట్లను ఉపయోగించనప్పుడు బూట్ స్పేల్ 85 లీటర్లకు తగ్గుతుంది.

ఇవే కాకుండా 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేకి సపోర్టు ఇస్తుంది. అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీటు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ,ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, స్టీరింగ్ వీల్‎పై మ్యూజిక్, ఫోన్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సెక్యూరిటీ పరంగా చూసినట్లయితే..4 ఎయిర్ బ్యాగ్ లు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‎తో కూడిన యాంటీ‎లాక్ బ్రేకింగ్ సిస్టిమ్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, బ్యాక్‎సైడ్ కెమెరా కూడా ఉంటుంది. లీటర్‎కు 19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.