పెరియార్ విగ్రహాన్నీలేపేస్తాం.. బీజేపీ - MicTv.in - Telugu News
mictv telugu

పెరియార్ విగ్రహాన్నీలేపేస్తాం.. బీజేపీ

March 6, 2018

ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచామన్న సంబరంలో ఉన్న బీజేపీ నేతల రెచ్చిపోతున్నారు.  త్రిపురలో విప్లవనేత లెనిన్ విగ్రహాన్ని కూల్చేసిన ఆ పార్టీ కార్యకర్తలు తాజాగా తమిళనాడుపై దృష్టిసారించారు. ప్రముఖ హేతువాది, ద్రవిడ ఉద్యమ నేత రామస్వామి పెరియార్ విగ్రహాలను కూడా పెకలిస్తామని ఆ రాష్ట్ర బీజేపీ నేత హెచ్.రాజా హెచ్చరించారు. ‘అసలు లెనిన్ ఎవరు? మనదేశంతో ఆయనకు ఏం సంబంధం? త్రిపురలో ఆయన విగ్రహాన్ని తొలగించడం సరైందే.. ఇవాళ త్రిపురలో లెనిన్… రేపు కులతీవ్రవాది రామస్వామి నాయకర్‘ అని ట్వీట్ చేశారు.

రాజా హెచ్చరికలపై ద్రవిడ పార్టీల భగ్గుమంటున్నాయి. బీజేపీ ఆటలు ఉత్తరాదిలో సాగుతాయిగాని దక్షిణాదిలో సాగవని హెచ్చరించాయి. విద్వేషాలు రెచ్చగొడుతున్న రాజాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.  

విదేశీ నేతల విగ్రహాలు మనకొద్దు.. కేంద్రమంత్రి  

విదేశీ నాయకుల విగ్రహాలకు మనదేశంలో చోటులేదని కేంద్ర సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ అన్నారు. త్రిపురను త్వరలోనే బాగా చక్కబెడతామన్నారు.  మనకు మహాత్మాగాంధీస్వామి వివేకానంద, ఆంబేడ్కర్దీన్ దయాళ్, లోహియా వంటి నేతలెందరో ఉండగా, విదేశీ నేతల విగ్రహాలు దండగ అని చెప్పారు.