permanent-ambassador-of-kailasa-country attended to UNO meeting
mictv telugu

ఐక్యరాజ్య సమితి వరకూ పాకిన నిత్యానందుడి లీలలు

February 28, 2023

permanent-ambassador-of-kailasa-country attended to UNO meeting

నిత్యానంద గురించి అందరూ జోకులు వేస్తారు కానీ….ఐక్యరాజ్యసమితి మాత్రం సీరియస్ గా తీసుకుంది. ఏంటి జోక్ చేస్తున్నాని అనుకుంటున్నారా. అబ్బే మాకంత సీన్ ఎక్కడ ఉంది ఏకంగా ఐక్యరాజ్యసమితే జోక్ చేస్తేను. అందరూ అవాక్కయ్యేలా ప్రవర్తిస్తుంటేనూ. ఏం చెప్తున్నామో అర్ధం కావడం లేదా. అయితే ఈ వార్త చదివేయండి. మీకే క్లారిటీ వచ్చేస్తుంది.

భారతదేశంలో పిచ్చి దైవాలకు, మతగురువులకు కొదవే లేదు. ఎప్పటికప్పుడు స్వామీజీల అరాచకాలు బయటపడుతూనే ఉంటాయి. కానీ మళ్ళీ కొత్త స్వామి పుట్టుకొస్తూనే ఉంటాడు. పిచ్చి నమ్మకాలతో జనాలు ఉన్నంతవరకూ ఇలాంటి స్వామీజీలకు కొదవేముంటుంది చెప్పండి. అలాంటివాళ్ళల్లో ఒకడే నిత్యానంద.కొంతకాలం క్రితం వరకూ భారత్ లోనే ఉన్న ఈ పిచ్చి స్వామి తరువాత ఎక్కడికో పారిపోయాడు. పోని పోయినవాడు తిన్నగా ఉన్నాడా, అక్కడో దేశాన్నే సృష్టించేశాడు. అక్కడ ఎవరున్నారు, ఎంత భూమి ఉంది, దేశం అని చెప్పడానికి ఏ విధమైన ఆధారాలున్నాయి ఇవేమీ ఎవరికీ పెద్దగా తెలియదు. అక్కడికి వెళ్ళి వీడియోలు తీసి పెట్టినవారూ ఎవరూ లేరు. మన నిత్యానందే అక్కడ నుంచి లైవ్ లో కనిపిస్తూ ఉంటాడు. మీ ఇన్ మీ అంటూ పిచ్చి ప్రసంగాలు చేస్తుంటాడు. ఇండియాలో నిత్యానంద మీద బోలెడు కేసులు. లైగింకవేధింపులు చేసాడు అంటూ కంప్లైంట్స్ ఇచ్చారు. మత్తు పదార్ధాల వాడుకకు కూడా అలవాటు చేస్తాడు అనే నేరం ఉంది ఇతని మీద. అందుకే ఇక్కడ నుంచి పారిపోయాడు.

కట్ చేస్తే ఇప్పుడు ఆ నిత్యానంద, అతని దేశమే హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఎలా అంటారా…అదిగో మన ఐక్యరాజ్య సమితి వల్ల. ఐక్యరాజ్యసమితిలో దాదాపు అన్ని దేశాలకూ సభ్యత్వం ఉంటుంది. అక్కడ జరిగే సమావేశాలకు అన్ని దేశాల ప్రతినిధులూ హాజరవుతుంటారు. ప్రపంచ శాంతి, సమైక్యత కోసం ఇది పని చేస్తూ ఉంటుంది. అందరూ దీని మాటను గౌరవిస్తుంటారు కూడా. అయితే ఐక్యరాజ్యసమితిలో నిజంగా ఉన్న దేశాలకే సభ్యత్వం ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఇలా సృష్టించిన దేశాలకు కూడా సభ్యత్వం ఇస్తారని, వాళ్ళని సమావేశాలకు పిలుస్తారని మాత్రం ఎవ్వరికీ తెలియదు.

నిత్యానంద సృష్టించిన దేశం కైలాసం ఎవరికి కనిపించినా కనిపించకపోయినా ఐక్యరాజ్యసమితికి మాత్రం కనిపించింది. అందుకే తన సీఈఎస్ఆర్ 19వ సమావేశాలకు వాళ్ళ ప్రతినిధులను పిలిచింది. కైలాసం నుంచి మాతా విజయప్రియ నిత్యానంద హాజరయ్యారు. ఈమె కైలాస దేశానికి పర్మనెంట్ అంబాసిడర్ అంట. రావడమే కాదు….మీటింగ్ ఉద్దేశాల్లో ఒకటైన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై స్పీచ్ కూడా దంచేసింది మాత. హిందూత్వానికీ, సుస్థిరరాభివృద్ధికి కనెక్షన్ ఉంది అని అన్నారు. దొరికిందే ఛాన్స్ అని నిత్యానింద మీద ఉన్న కేసులు గురించి మాట్లాడేసింది మాత. ఆయనను అనవసరంగా వేధిస్తున్నారని, శిక్షించాలని చేస్తున్నారని ఆరోపించింది. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కోరింది.ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే కైలాస దేశం ఏకంగా 150 దేశాల్లో రాయబార కార్యాలయాలను కూడా స్థాపించిందట.

ఏంటో ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం ఎటు పోతుందో తెలియడం లేదు. ఒక దేశానికి ఉండవలసిన అర్హలు ఏంటో….ఎవడు పడితే వాడు స్థాపించేస్తే దేశం అయిపోతుందా అంటి ప్రశ్నలన్నీ బుర్రచుట్టూ తిరిగి కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి కదూ. దీనిబట్టి రేప్పొద్దుట ఒక టెర్రరిస్టు లేదా హత్యలు చేసివాడు కూడా ఎక్కడికైనా పారిపోయి అక్కడ ఒక దేశాన్ని సృష్టించేవచ్చు. దానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం కూడా తెలిపేస్తుంది…అంతే కదండీ. అలాగే అనిపిస్తోంది కదా మీకు కూడా.ఏంటో అంతా నిత్యానంద మహిమ. మొత్తానికి అనుకున్నది సాధిస్తున్నాడు గురుడు.