కరోనా ప్రభావంతో గత మూడేళ్ల నుంచి ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇదే నిర్ణయిం తీసుకున్నారు. ఇక భవిష్యత్తులో కూడా ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాస్వతంగా తొలిగించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం త్వరలో అధికారిక జీవోను విడుదల చేయనున్నట్లు సమాచారం. జేఈఈ వంటి వాటిల్లో మార్కుల వెయిటేజీ పద్ధతి లేకపోవడంతో ఎంసెట్‌లో కూడా దీన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు జరగనున్నాయి. ఇక ఎంసెట్ పరీక్షలో..మొదట మ్యాథ్స్, ఆ తర్వాత ఫిజిక్స్, చివరగా కెమిస్ట్రిలో వచ్చిన మార్కులు ఆధారంగా ర్యాంకును నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఆన్ పరీక్షలు నిర్వహిస్తున్నందున ఒకటికి మించి ఎక్కువ ప్రశ్నపత్రాలు ఉండడంతో మార్కులు కాకుండా పర్సంటైల్‌ను లెక్కిస్తున్నారు. పర్సంటైల్ కూడా ఒకటే వస్తే డేటా ఆఫ్ బర్త్ పరిగణలోనికి తీసుకుని ఎవరు పెద్దవారైతే వారికి మెరుగైన ర్యాంకును కేటాయిస్తారు. తెలంగాణ మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.