ఆ విషయంలో కేసీఆర్ చెప్పినా జగన్ వినలేదట.. ఏపీ మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

ఆ విషయంలో కేసీఆర్ చెప్పినా జగన్ వినలేదట.. ఏపీ మంత్రి

February 15, 2020

Perni Nani Comments On Jagan And KCR

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌కు మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. పాలన పరమైన విధానాల్లో ఇద్దరూ కలిసి చర్చించుకొని నిర్ణయాలను తీసుకుంటూ ఉంటూ ఉంటారు. అలాంటిది ఏపీ సీఎం జగన్ ఓ అంశంలో కేసీఆర్ చెప్పిన మాటను కూడా వినలేదట. ఈ విషయాన్ని తాజాగా ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులకు ఇంధన పొదుపు, భద్రత అవార్డులు అందించే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాధన వచ్చినప్పుడు జగన్ కేసీఆర్ సలహా తీసుకున్నారట. కానీ దీన్ని కేసీఆర్ అంగీకరించలేదట. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయవద్దనీ, దీని కారణంగా కార్మికుల వేతనాలు ప్రభుత్వం భరించడం గుదిబండ మారుతుందని సూచించారట. కానీ జగన్ వినకుండా మొండిగా కార్మికుల మేలు కోసం వారిని ప్రభుత్వంలో విలీనం చేశారని చెప్పారు. ఎవరెన్ని చెప్పినా కార్మికులకు న్యాయం చేయగలిగామన్నారు.  ఆర్టీసీ కార్మికులు తమపై నమ్మకం ఉంచాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల ఫించన్ల అంశంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.