పవన్ బీసీ, కాపు సంఘాల సమావేశాలపై మాజీ మంత్రి పేర్నినాని మండి పడ్డారు. సినిమా డైలాగులతో ప్రసంగించే పవన్‌కు సిద్ధాంతాలు, లక్ష్యాలు లేవని విమర్శించారు. నోటికి వచ్చింది మాట్లాడి తర్వాత హైదరాబాద్ వెళిపోతారని ఆరోపించారు. కాపుల కోసం పవన్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కులాలపై కనీస అవగాహన లేదన్నారు.
రాజకీయాల్లో ఆస్కార్ అవార్డు ఉంటే ప్రతి ఏటా పవన్ కల్యాణ్ కే ఇవ్వాలని పేర్నినాని ఎద్దేవ చేశారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటారో క్లారిటీ ఉండదని విమర్శించారు.లోపాకారీ ఒప్పందాలకు పవన్ స్పెష్టలిస్ట్ అంటూ సెటైర్లు వేశారు. 2014లో చంద్రబాబుకు అమ్ముడుపోతే.. 2019 ఎన్నికల ముందు బీజేపీని తిట్టి, ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసిపోయారని ధ్వజమెత్తారు.రంగులు మార్చే పవన్ కల్యాణ్‌ను ప్రజలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని పేర్నినాని స్పష్టం చేశారు.
మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచారు. అన్ని వర్గాల మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆదివారం బీసీ రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు కాపు సంక్షేమ సేనతో పవన్ భేటీ అయ్యారు. మరోవైపు రేపు మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం సిద్ధం చేసిన వారాహి వాహనంతో సభకు పవన్ రానున్నారు. ఈ సభ ద్వారానే తర భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తారని జనసేన శ్రేణులు భావిస్తున్నారు.