ఉప్పల్ బాలు , స్వాతినాయుడిపై పోలీసులకు ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

ఉప్పల్ బాలు , స్వాతినాయుడిపై పోలీసులకు ఫిర్యాదు

May 11, 2022

యూట్యూబర్స్ ఉప్పల్ బాలు, స్వాతినాయుడు, శ్రీకాంత్ రెడ్డిలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడో వ్యక్తి. వారు చేసే అశ్లీల, ప్రాంక్ వీడియోల వల్ల పిల్లలు చెడిపోతున్నారని.. వెంటనే వాటిని కట్టడి చేయాలని సతీశ్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అశ్లీలంగా, డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో వీడియోలు చేస్తున్న వీరిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

సోషల్ మీడియాలైన ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో ఇలాంటి వీడియోలు పెట్టకుండా వారిపై యాక్షన్ తీసుకోవాలన్నారు. ఆ ముగ్గురితో పాటు ఇతర ప్రాంక్, అశ్లీల యూట్యూబర్స్‌పై కూడా సతీశ్ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అశ్లీల, ప్రాంక్ వీడియోల వల్ల అనర్థాలను వివరిస్తూ ఓ బ్యానర్‌తో నగరంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు సతీశ్.