Pesky parrot steals reporter's earphone live on air in Chile
mictv telugu

దొంగతనాలపై రిపోర్టర్ లైవ్..ఇంతలోనే అతనిదీ చోరీ..

November 6, 2022

చిలీలో ఓ రిపోర్టర్‌కు వింత అనుభవం ఎదురైంది. దొంగతనాలపై మాట్లాడుతున్న అతనిపై లైవ్‌లోనే చోరీ జరిగింది. అయితే ఈ చోరీ చిలుక చేయడం విశేషం.చిలుక ఏంటీ..లైవ్‌లో చోరీ ఏంటీ అనుకుంటుకున్నారా.. అయితే ఒక సారి కింద వివరాలను చూడండి..

దొంగతనాలపై ఓ ఫీల్డ్ జర్నలిస్టు లైవ్ ఇస్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిన ఓ చిలుక అతని భుజంపై వాలింది. నికోలస్ పట్టించుకోకండా తన పని తాను చేసుకుంటున్నాడు. ఇంతలో అతని చెవిలో ఉన్ని ఇయర్ ఫోన్‌ను నోట కరుచుకుని ఎగిరిపోయింది. ఆ తర్వాత చిలుకను పట్టుకుందామని అవకాశం లేకుండా పోయింది. అయితే కాసేపు అయ్యాక దగ్గర్లోనే చిలుక ఇయర్ ఫోన్ పడేసినట్లు అతను తెలిపాడు. ఇదంతా కెమెరాలో రికార్డు కావడం, ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం..అది వైరల్ కావడం చకాచకా జరిగిపోయాయి.