పోలీస్ స్టేషన్‌లో కుక్క ఫిర్యాదు.. కుయ్‌కుయ్, భౌభౌ! - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్ స్టేషన్‌లో కుక్క ఫిర్యాదు.. కుయ్‌కుయ్, భౌభౌ!

February 26, 2020

Pet dog

కుక్కలు తెలివైనవని మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. మనుషుల మధ్య మెలిగే శునకాలకు మనుషుల తెలివితేటలు కూడా ఆటోమేటిగ్గా వచ్చేస్తాయి. ఏదో పనిపై రోడ్డెక్కి, ఇల్లు మరిచిపోయి, దారి తప్పిన కుక్క ఒకటి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. రిసెప్షన్ వద్ద రెండు కాళ్లు ఎత్తి.. ‘కుయ్ కుయ్, భౌభౌ.. గుర్ గుర్.. సార్, నేను దారి తప్పాను. ప్లీజ్ నన్ను మా యజమాని ఇంటికి చేర్చండి. ఈ సిటీలో ఏది ఎక్కడుందో నాకేం అర్థం కావడం లేదు.. ప్లీజ్ ప్లీజ్. ఇంకోసారి దారి తప్పను..’ అని భౌభౌ భాషలో ఫిర్యాదు చేసింది. 

యజమానులు దాన్ని కావాలనే వదిలేసి ఉంటారని పోలీసులు మొదట్లో అనుకున్నారు. కానీ దాని వాలకం చూస్తే తాజగా ఇంట్లోంచి బయటపడి, కన్‌ఫ్యూజ్  అవుతున్న కుక్క అని నిర్ధారించుకున్నారు. రాత్రంతా దాన్ని స్టేషన్ లనే ఉంచుకుని సేవలు చేశారు. దాని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే, క్షణాల్లో కుక్క గోడు ఊరంతా తెలిసిపోయింది. కుక్క యజమాని కూడా ఆ ఫోటోలను చూసి పోలీసులకు ఫోన్ చేయడం, ఆ మూగజీవిని పోలీసులు ఇంటికి చేర్చడం చకచకా జరిగిపోయాయి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఒడెసా నగరంలో ఈ వింత చోటు చేసుకుంది. ఠాణకు వెళ్లిన కుక్క పేరు చికో. వయసు ఏడాది మాత్రమే. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన దీన్ని ఎడ్వర్డ్ అల్వరాడో అనే పెద్దమనిషి పెంచుకుంటున్నారు. అతడు నిద్రపోతుండగా.. ఏం పని పనిందో ఏమోగాని చికీ తెల్లారగట్టన 4 గంటలకు బజారుకెక్కింది!