తప్పిపోయిన చిలుక.. పట్టిస్తే క్యాష్ రివార్డ్ - MicTv.in - Telugu News
mictv telugu

తప్పిపోయిన చిలుక.. పట్టిస్తే క్యాష్ రివార్డ్

May 6, 2022

గత 12 ఏండ్లుగా ప్రేమగా పెంచుకుంటుకున్న పెంపుడు చిలుక కనిపించకపోవడంతో బీహార్‌లోని ఓ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. చిలుక(పేరు పోపో) కనిపించడం లేదంటూ గోడలపై పోస్టర్లు అతికించడంతోపాటు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తున్నారు. చిలుకను పట్టించిన వారికి క్యాష్‌ రివార్డ్‌ కూడా ఇస్తామని ప్రకటించారు.

గయాలోని పిప్పరపాటి రోడ్డులో నివాసం ఉంటున్న శ్యామ్ దేవ్ ప్రసాద్ గుప్తా, ఆయన భార్య సంగీత గుప్తా దంపతులు పన్నెండేండ్లుగా తమ ఇంట్లో ఓ చిలుకను పెంచుకుంటున్నారు. గత నెల ఏప్రిల్ 5వ తేదీ నుంచి అది కనిపించకుండా పోవడంతో… చిలుక ఆచూకీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చిలుక ఆచూకీ తెలిపిన వారికి రూ.5,100 రివార్డు ప్రకటించారు. “మా చిలుకను ఎవరు తీసుకెళ్లారో, దయచేసి తిరిగి ఇవ్వండి. దానికి బదులుగా మీకు మరో మూడు చిలుకలను కొని ఇస్తాం. అది పక్షి మాత్రమే కాదు మా కుటుంబంలోని సభ్యుడు” అని దంపతులు అంటున్నారు.